బచ్చన్నపేట: ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

50చూసినవారు
బచ్చన్నపేట: ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోజువారీగా నిర్వహించే రికార్డులను, డాక్టర్ల హాజరును ఓపీ విభాగంను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్