దూల్మిట్ట మండలంలో మంగళవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి జైల్లో నిర్బంధించిన రైతులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.