హోటల్ ను తనిఖీ చేసిన ఫుడ్ ఇన్ స్పెక్టర్

1540చూసినవారు
హోటల్ ను తనిఖీ చేసిన ఫుడ్ ఇన్ స్పెక్టర్
జనగామ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హోటల్ ను జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కృష్ణమూర్తి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. శనివారం హోటల్ పై వచ్చిన పిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించిన అధికారులు హోటల్లో నెలకొన్న అపరిశుభ్రతను, ఆహార పదార్థాలను, వంట పాత్రలను శుభ్రం చేసే విధానాన్ని, ఆహార పదార్థాలను నిల్వ ఉంచే విధానాన్ని పరిశీలించి హోటల్ యాజమాన్యానికి 5వేల రూపాయల జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్