తాడిచెట్టు నుండి పడిన గీత కార్మికుడు

11457చూసినవారు
తాడిచెట్టు నుండి పడిన గీత కార్మికుడు
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన నర్మెట చిన్న సత్తయ్య అనే కల్లుగీత కార్మికుడు రోజువారీ వృత్తిలో భాగంగా తాడి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో కాలుజారీ కిందపడినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో సత్తయ్యకు నడుముకు కాలుకు దెబ్బలు తగిలి, చెయ్యి విరిగిందని వివరించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్