జనగామలోని ఏసీ రెడ్డి నగర్ కు చెందిన సీనియర్ సిపిఎం పార్టీ సభ్యురాలు గుడిసె వాసి అయిన ఎనగందుల సుగుణమ్మ అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందగా, గుడి సేవా సంఘం నాయకులు బూడిది గోపి, జోగు ప్రకాష్, సుగుణమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో గుడి సేవా సంఘం నాయకులు, కార్యకర్తలు సోలితి లావణ్య, పల్లె లలిత, పందిళ్ళ కళ్యాణి, రజిత, ఉగాడి శివ, మేడ నరసింహ, మల్లెల శంకర్, సిహెచ్ ఉపేందర్, గిద్దలు ఎల్లయ్య, గుండె మల్లేష్, పశువుల ది పోశయ్య, గండి మనోహర్, ఎల్లమ్మ, యకమ్మ, పెద్దాపురం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.