జనగాం: ముఖ్యమంత్రి కప్ క్రీడలకు పటిష్టమైన ఏర్పాట్లు

78చూసినవారు
జనగాం: ముఖ్యమంత్రి కప్ క్రీడలకు పటిష్టమైన ఏర్పాట్లు
జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ముఖ్యమంత్రి కప్ క్రీడల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. శనివారం సంబంధిత అధికారులతో కలిసి మున్సిపల్ స్టేడియంను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట వెంకట రెడ్డి, వెంకటేశ్వర్లు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్