జనగామ: కలెక్టరేట్ ఎదుట బిసి సంఘాల ధర్నా

52చూసినవారు
జనగామ జిల్లా లో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుట మంగళవారం బిసి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకొని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. వెంటనే విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్