అర్హులైన ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సోమవారం జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని షామీర్పేట పసురమడ్ల పలు గ్రామాల్లో కొనసాగుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ అధికారులతో పరిశీలించారు.