అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి సీఎస్ శాంతి కుమారిలతో కల్సి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ల్లో జనగాం జిల్లా నుండి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు.