కమలాపుర్: తీవ్ర జ్వరంతో బస్సులో మహిళ మృతి

71చూసినవారు
కమలాపుర్: తీవ్ర జ్వరంతో బస్సులో మహిళ మృతి
హన్మకొండ జిల్లా కమలాపుర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన అంకిళ్ళ కవిత(36) జ్వరంతో నాలుగు రోజులుగా బాధ పడుతుంది. దీంతో తన భర్త చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తిరిగి ఆర్టీసీ బస్సులో ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామానికి రాగానే భార్యను లేపడంతో ఎంతకీ లేవకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాడు. భార్య మృతి తో ఆ భర్త కన్నీటి పర్యంతమయ్యాడు.

సంబంధిత పోస్ట్