కొమరవెల్లి మండల కమిటీ సమావేశంలో CPM రాష్ట్ర నాలుగో మహాసభలు 2025 జనవరి 25 నుండి 28 తేదీలలో సంగారెడ్డిలో జరుగుతున్నాయని శనివారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్థిక, సామాజిక అంశాలు కార్మికులు, కర్షకులు, పేదలు, మహిళలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు.