కొమురవెల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏర్పుల మహేశ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు మల్లన్న చిత్రపటం, ప్రసాదం అందజేశారు. శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు, దర్శనానికి వచ్చి మొక్కులతో పాటు పట్నం చెల్లించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ జాగృతి అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, ముక్కు విరాట్ బాబు తదితరులు పాల్గొన్నారు.