కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో సీపీఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో వడ్ల మార్కెట్‌ను ఆదివారం పరిశీలించారు. ఈ పరిశీలనలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తాడూరు రవీందర్ పాల్గొని మాట్లాడుతూ. గ్రామంలో సుమారు నెలరోజుల నుండి వడ్లను మార్కెట్లో పోసి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్కెట్లో పోసిన వడ్లకు పరదాలు తీసుకొచ్చి, కిరాయి కట్టుకుంటూ నానా అవస్థలు పడుతూ, ఈ ఇబ్బందులు భరించలేక దళారులకు అమ్ముకుంటున్నారన్నారు.