సినీ నటుడు సోను సూద్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం జనగామలోని గిర్నిగడ్డలోని రాజరాజేశ్వరీ వృద్దాశ్రమంలో ఉల్లేంగుల సాగర్ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సాగర్ మాట్లాడుతూ... సోను సూద్ చేసే సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి చెంది తన పుట్టిన రోజు సందర్భంగా రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో చీరలు పంపిణీ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. సోను సూద్ సినిమాలో విలన్ గా నిజ జీవితంలో హీరో గా మారాడని, తను ఎంతో మందికి సాయం చేశాడని, లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్ర వలస కూలీలను వాళ్ల స్వంత ఊరిలకి చేర్చడమే కాకుండా రీసెంట్ గా ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు పొలం దున్నడన్ని చూసి వాళ్ల కుటుంబం కి ట్రాక్టర్ కూడా కొని ఇచ్చాడు వాళ్ళని చదువుకోవాల్సింది గా కోరాడని అన్నారు. అంతే కాదు ఇంకా చాలా మందికి చాలా రకాలుగా సాయం చేశాడని, తను విలన్ కాదు పేద కుటుంబాల పాలిట దేవుడిలా కనిపిస్తున్నాడని, అలాంటి గొప్ప మనసు ఉన్న సోను సూద్ పుట్టిన రోజు నేడు ఇలా చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు.