కొత్తగూడ ఏజెన్సీలో అరుదైన ఉడుత
కొత్తగూడ ఏజెన్సీలోని పాకాల అభయారణ్యంలో శనివారం అరుదైన ఉడుత కనిపించింది. స్థానిక గుంజేడు ముసలమ్మ ఆలయానికి వచ్చిన భక్తులకు ఓ చెట్టుపై పాకుతూ ఇది కనిపించగా వారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అది ఉడుతల్లో అరుదైన జాతి అని ఎఫ్ఆర్వో వజాయిద్ తెలిపారు. కాగా ముదురు ఎరుపు, నలుపు రంగులు కలగలిపి ఉన్న ఉడుతను ఇండియన్ జెయింట్ స్కిరెల్ అని కూడా పిలుస్తారని తెలుస్తున్నది.