మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఓ వడ్డీ వ్యాపారస్తుడి ఇంట్లో భారీ చోరీ ఘటన ను బుధవారం పోలీసులు చేధించారు.
చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన కోటగిరి రవి ని అరెస్టు చేశారు.
9 లక్షల 90 వేలు నగదు, 26 లక్షల 50 వేల విలువగల బంగారు, వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ తెలిపారు.