ప్రభుత్వ వసతి గృహాల నిర్వాహణపై శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో చలికాలం కాబట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మెనూ పాటించేలా సంబధిత అధికారులు వార్డెన్లు చూడాలని తెలిపారు.