మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కొత్త పోచారంలో లక్ష డప్పులు - వేల గొంతుల కార్యక్రమ జయప్రదం కోసం తిప్పారుపు హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామంలో డప్పు చాటింపు ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గిన్నారపు మురళీతారకరామారావు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఇంటికో మనిషి - మనిషికో డప్పుతో గూటం దెబ్బల డప్పుల దరువై హైదరాబాద్ కు తరలిరావాలని కోరారు.