మహబూబాబాద్కి చెందిన ఓ మహిళ గురువారం కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలను కాపాడారు. చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో సీపీఆర్ చేసి మహిళ కాపాడిన పోలీస్ ను పలువురు అభినందించారు.