మహబూబాబాద్ పట్టణ పోలీసులు గంజాయి అమ్ముతున్న ముగ్గురు మహిళలు జటోతు లక్ష్మి, పెద్ద వంగర గ్రామానికి చెందిన ధరంసోత్ కమల, మర్రిపెడా బంగ్లా గయామా తండాకు చెందిన ధరంసోత్ సరితను గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ కోటి రెడ్డి మాట్లాడుతూ జటోతు లక్ష్మి గత కొంతకాలంగా గంజాయి అమ్మకాలు, కొనుగోలు చేస్తుందన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ధరంసోత్ కమలా ఆమె కుమార్తె సరితకు గంజాను విక్రయించడానికి ప్రయత్నించగా పోలీసులు రైడ్ చేసి లక్ష్మి మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. సంఘటనా స్థలం నుంచి 27 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సీఐ రవి కుమార్, ఎస్ అరుణ్ కుమార్, ఇతర సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.