గురుకులాల పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతీయ సంమన్వయాధికారి శ్రీ. రాజ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల వంటగది, స్టోర్ రూం, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు.