మరిపెడలో భారీ వర్షం
మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలో మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటలకు వర్షం మొదలై గంట పాటు కొట్టడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. కార్గిల్ సెంటర్లో నీటి ప్రవాహం ఎక్కువై వరదలా ప్రవహించడంతో వాహనాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. బాటసారులకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది.