కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ వర్దన్నపేట నియోజకవర్గ ఇంచార్జిగా చిర్ర సుమన్ ను నియమించారు. ఈ సందర్భముగా నియామక పత్రాన్ని నరేష్ సోమవారం సుమన్ కు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని నరేష్ తెలిపారు.