ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రోడ్డుపై భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడింది. తాడ్వాయి మండల కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలోని బీరెల్లి, కాటాపూర్, బయ్యారం వెళ్లే రహదారిపై సోమవారం రాత్రి ఓ భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో కాటాపూర్, బయ్యారం, మణుగూరు వైపు వెళ్లే వాహనాలు మంగళవారం నిలిచిపోయాయాయని స్థానికులు తెలిపారు.