ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా ఆదివాసీ కొమరం భీం వర్ధంతి

74చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా ఆదివాసీ కొమరం భీం వర్ధంతి
ఆదివాసీ నాయకపోడ్ ములుగు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద గురువారం ఆదివాసీల పోరాటాల యోధుడు కొమురం భీం 86వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జల్ జంగిల్ జమీన్ అనే నినాదాలతో స్వయం పాలన కొరకు ఆదివాసులను ఏకం చేసి పోరాటం చేసిన యోధుడు కొమురం భీం అని అన్నారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలర్పించిన యోధుడు కొమరం భీం అని అన్నారు.

సంబంధిత పోస్ట్