ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లల ఎదుగుదలను పక్కాగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఐసిడిఎస్ పనితీరుపై కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్ ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఓపెన్ చేయాలని ఆదేశించారు.