వైద్య ఆరోగ్య శాఖలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేస్తూ మోసాలకు గురి చేస్తున్నారని ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు. మోసపూరిత ఫోన్స్ కాల్స్ కు స్పందించి మోస పోవొద్దని తెలిపారు. ప్రభుత్ రంగ సంస్థల్లో ఏదైనా పోస్ట్ ఖాళీ అయితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, జిల్లా కలెక్టర్ అనుమతితో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు.