కూలిన చెట్లను పరిశీలిస్తున్న అటవి అభివృద్ధి చైర్మన్ వీరయ్య

80చూసినవారు
కూలిన చెట్లను పరిశీలిస్తున్న అటవి అభివృద్ధి చైర్మన్ వీరయ్య
ములుగు జిల్లా తాడ్వాయి-మేడారం మధ్య అటవీ ప్రాంతంలో గత నెల 31న సాయంత్రం క్లౌడ్ బరస్ట్ తో అడవి విధ్వంసమై లక్షల చెట్లు నేల కూలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీగా చెట్లు కూలిన ప్రదేశాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర అటవి అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదేం వీరయ్య, ఫారెస్ట్ అధికారుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మొత్తం ఎన్ని చెట్లు ద్వంసం అయ్యాయో పూర్తిగా విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్