ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జనగలంచ గుత్తి కోయ హాబిటేషన్ ను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గుడారాలకు వెళ్లి గర్భిణీ స్త్రీలను, బాలింతలను ప్రభుత్వం నుండి సరఫరా చేసే పోషకాహార పదార్థాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ ను తనిఖీ చేశారు.