జాతిపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. బుధవారం మాహత్మాగాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద ఉన్నా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు.