మల్లూరులో 46°C ఉష్ణోగ్రత నమోదు

52చూసినవారు
మల్లూరులో 46°C ఉష్ణోగ్రత నమోదు
ములుగు జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మంగపేట మండలంలోని మల్లూరులో 46°C డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. వెంకటాపురం 46°C, ధర్మవరం 45°C, మేడారం 45°C, మంగపేట 45°C, ఆలుబాక 45°C డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో జిల్లాలో ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. పలుప్రాంతాల్లో ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్