ములుగు జిల్లా వెంకటాపురం గోదావరి సరిహద్దులో పులి సంచరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం అటవీశాఖ అధికారులు గోదావరి సమీప పొలాల వద్దకు చేరుకుని అడుగుజాడలను గుర్తించారు. కాగా గోదావరి దాటి పులి మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహస్వామి గుట్టల్లోకి వెళ్లిందని చెప్పారు. సమీప గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీశాఖ అధికారులు సూచించారు. పులి సంచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.