రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

70చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ను పురస్కరించుకొని పంచాయతీ రాజ్ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క బుధవారం ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా చేపట్టే ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, పేదవారికి దానం వంటి కార్యక్రమాలు స్వీయ క్రమశిక్షణను, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని మంత్రి అన్నారు. మానవీయ విలువలను రంజాన్ పండుగ పెంపొందిస్తుందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్