గుజరాత్‌ టార్గెట్ 197 రన్స్

53చూసినవారు
గుజరాత్‌ టార్గెట్ 197 రన్స్
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్ (76; 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), సంజు శాంసన్ (68*; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టారు. యశస్వి జైస్వాల్ (24), హిట్‌మేయర్ (13*; 5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) పరుగులు సాధించారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్‌ ఖాన్‌, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్