హాస్యనటుడు వీర్ దాస్‌కు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. షూటింగ్ కోసం వెళ్లిన ఆయన ఇటీవల ఓ రిసార్ట్‌లో బస చేశారు. మూత్రవిసర్జన కోసం బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో ఓ పాము పై కప్పు నుంచి ఫ్లష్ హ్యాండిల్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ మీద పడింది. దీంతో ఆయన భయపడి వెనక్కి వచ్చేశారు. అదృష్టవశాత్తూ ఆ పాము ఆయనను కాటు వేయలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.