ములుగు: అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

85చూసినవారు
ములుగు: అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న కలపను ఫారెస్ట్ అధికారులు గురువారం పట్టుకున్నారు. వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో బుధవారం రాత్రి మూడు ఎడ్ల బండ్లల్లో టేకు, జిట్రేగి దుంగలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన కలపను ములుగు రేంజ్ ఆఫీస్ కు అటవీశాఖ అధికారులు తరలించారు.

సంబంధిత పోస్ట్