ములుగు: రోడ్డు భద్రతా మాసోత్సవాల ర్యాలీని ప్రారంభించిన డీఎస్పీ

80చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, సీటు బెల్టు ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్