ములుగు: లక్ష్య సాధనలో హెల్త్ సూపర్వైజర్లు సరైన పనితీరును అవలంబించాలి

67చూసినవారు
ములుగు: లక్ష్య సాధనలో హెల్త్ సూపర్వైజర్లు సరైన పనితీరును అవలంబించాలి
ఆరోగ్య కార్యక్రమాల లక్ష్య సాధనలో సూపర్వైజర్లు సరైన పనితీరును అవలంబించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు అన్నారు. ములుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న సూపర్వైజర్స్, ఆరోగ్య కార్యకర్తలు (మేల్) కు డీఎంహెచ్ఓ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందడంలో సూపర్వైజర్ల పాత్ర ముఖ్యమైందని అన్నారు. సరైన పనితీరును అవలంబించకపోతే శాఖా పరమైన చర్యలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్