పోషకాహారం మనిషికి అమృతం లాంటిదని, అంగన్వాడీ ద్వారా అందే పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనసూయ సీతక్క రాష్ట్ర ప్రజలను కోరారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం లోని రైతు వేదిక వద్ద మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ములుగు ఆధ్వర్యం లో "పోషణ్ - మా" సంబరాల జిల్లా స్థాయి ముగింపు వేడుకల కార్యక్రమం లో మంత్రి సీతక్క పాల్గొన్నారు.