తాడ్వాయి మండలం ఏజెన్సీ ప్రాంతమైన కాల్వపెల్లిలో మావోయిస్టుల డ్రమ్ము కలకలం రేపింది. కాల్వపెల్లి గ్రామ శివారులో ఉన్న పీరయ్య అనే రైతు, తన పోడు భూమిని దున్నుతుండగా ఇనుప డ్రమ్ము బయటపడింది. భూమిలో డ్రమ్మును చూసిన రైతు డంప్‌గా భావించి అక్కడి నుండి వెళ్లిపోయారు. డ్రమ్ములో సదరు రైతుకు నగదు, ఆయుధాలు లభించాయని స్థానికుల ప్రచారంతో పోలీసులు శనివారం రంగంలోకి దిగారు. డంప్ ప్రదేశాన్ని బాంబ్ స్క్వాడ్‌తో పోలీసులు పరిశీలించారు.