ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో గురువారం డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య, డాక్టర్ చంద్రకాంత ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది పర్యటించారు. చల్వాయి గ్రామంతోపాటు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న బండకోయగూడెం గ్రామానికి వారు కాలినడకన వెళ్లి సేవలు అందించారు. 15 ఇళ్లను సందర్శించి ఇళ్లలో నిల్వ ఉన్న నీటిలో దోమలు లార్వా సేకరించి పరిశీలించారు. దోమల వల్ల కలిగే వ్యాధులపై గ్రామస్థులకు సూచనలు చేశారు.