ఇందిరా మహిళా శక్తి పథకాన్ని వినియోగించుకొని మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శక్తి కార్యక్రమం అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇందిరా మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ పథకాన్ని ములుగు జిల్లాలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు.