వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎంపీడీఓ కార్యాలయం పక్కన శనివారం వరి నారుమడిలో పెద్దపులి పాదముద్రలను ఎస్ఐ గోవర్ధన్ పరిశీలించారు. మండల ప్రజలు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ కోరారు. పెద్దపులి సంచారిస్తున్న సమాచారాన్ని వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. మండలంలోని గ్రామాల్లో ప్రచారం చేయించారు.