వరంగల్ జిల్లా నర్సంపేట లో గురువారం మంత్రుల పర్యటనలో భాగంగా మంత్రులని అడ్డుకుంటారన్న సమాచారంతో బిఆర్ఎస్ ముఖ్య నాయకులని, బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ లను పోలీసులు ముందస్తు గా అదుపు లోకి తీసుకున్నారు. న్యాయబద్ధంగా తమకు రావలసిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ప్రశ్నించే హక్కు కూడా తమకు లేదా అని బిఆర్ఎస్ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.