మహబూబాబాద్ జిల్లాలో పంచాయత్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందుకే గ్రామాలలో హడావుడి మొదలైనట్టు కన్పిస్తుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బిచ్చ నాయక్ తండాలో వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఇవ్వద్దు మద్యం తాగించొద్దు గ్రామ ప్రజలను మీ వెంట తిప్పి తాపీయొద్దు తినిపియొద్దు అంటూ బుధవారం ఉదయం చెట్టుకు ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ చర్చనియాంశంగా మారింది.