జూబ్లీహిల్స్ లో జరిగిన గ్యాంగ్ రేప్ నిందితులను వెంటనే శిక్షించాలి: ఏఐఎఫ్డిఎస్

590చూసినవారు
జూబ్లీహిల్స్ లో జరిగిన గ్యాంగ్ రేప్ నిందితులను వెంటనే శిక్షించాలి: ఏఐఎఫ్డిఎస్
రాష్ట్రం లోని మహిళలకు రక్షణ కరువైందని, తరచు మహిళలపై అఘాయిత్యాలు హత్యలు అరికట్టడం లో టిఆర్ఎస్ ప్రభుత్వం, పోలీస్ శాఖ విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమెక్య విమర్శించింది. సోమవారం నాడు నర్సంపేట డివిజన్ కేంద్రంలో స్థానిక ఓంకార్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి మార్త నాగరాజు పాల్గొని మాట్లాడుతూ.. మైనర్ బాలిక పై హత్యాచారానికి పాల్పడ నిందితులను కఠినంగా శిక్చించాలని డిమాండ్ చేసారు. తెలంగాణ దేశానికి ఆదర్శం అని ప్రగల్బాలు పలికే ముఖ్యమంత్రి నేటికీ ఘటన జరిగి వారం రోజులు అయినా ఘటనకు సంబందించిన నిందితులను అరెస్ట్ చేయకపోవడం ప్రభుతవం సమాధానం చెప్పాలన్నారు. నిందితుల్లో తెరాస అగ్రశేణి నాయకులూ ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు ఉండటం తో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నగరం లో ఇంత అవమానిక మైన ఘటన జరిగితె ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాదక ద్రవ్యాల నియంత్రించకపోవడం, రాష్ట్రంలో యదేచ్చగా నిబంధనలు అతిక్రమిస్తూ అర్ధ రాత్రి వరకు పబ్ లు నిర్వహిస్తున్నా, పబ్ లలో డ్రగ్స్ యథేచ్ఛగా విక్రయిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ఆదాయం పేరుతో తెల్లవారుజాము వరకు పబ్, బార్లకు అనుమతి ఇవ్వడం వంటి దుర్మార్గపు ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అనేక దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయన్నారు. నేతల ఒత్తిడితో కేసు నీరుగార్చే అవకాశం ఉన్నందున సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు జున్ను రమేష్, డివిజన్ నాయకులు గూడా సాయిరాం, వర్మ సాయి తేజ, వంశీ, రాకేష్, బిందు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్