మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లో శనివారం నుండి పోలీస్ హై అలెర్ట్ ప్రకటించారు. నేటి నుంచి అక్టోబర్ 20 వరకూ మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా తనిఖీలు నిర్వహించారు. వ్యాపార దుకాణ సముదాయాల ప్రాంగణాల్లో పోలీస్ డాగ్ స్కాడ్ తో విస్తృత తనిఖీలు చేశారు. నిత్యం వాహన తనిఖీలు గ్రామాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తూ అనుమానితుల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.