వరంగల్ జిల్లాఖానాపురం మండలం వజినపెల్లి లోని మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాల లో దారుణం జరిగింది. ఆదివారం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రిన్సిపాల్ పర్మిషన్ తో ఔటింగ్ కు తీసుకెళ్లి నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను గురుకులం లోకి ప్రిన్సిపాల్ అనుమతించలేదు. రెండు గంటల పాటు చలిలో పిల్లలతో తల్లిదండ్రులు గేటు ముందు పడిగాపులుగాసారు. విషయం జిల్లా కలెక్టర్ కు స్థానికులు తెలపడంతో జిల్లా అధికారుల ఫోన్ తో విద్యార్థులను లోపలికి సిబ్బంది అనుమతించారు.