ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి సీతక్క తెలిపారు.