వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారు మహేశ్వరంలో ఒక భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మహేశ్వరంలో ఆదివారం రాత్రి రైస్ మిల్లుల వద్ద కొండచిలువ ప్రత్యక్షం అవ్వగా, దానిని చూసేందుకు వాహనదారులు, స్థానికులు ఆసక్తి చూపారు. రోడ్డు నుంచి సమీపంలోని పొలాల్లోకి వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా కొండ చిలువ తిరుగుతున్న విషయంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.